గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పిటికే అల్లు అర్జున్‌తో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ డైలమాలో పడిపోయింది. మరి త్రివిక్రమ్ పరిస్థితేంటి?
Trivikram: ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫోకస్ మొత్తం పుష్ప2 పైనే ఉంది. పుష్పతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్నబన్నీ.. పుష్ప2తో మరోసారి దుమ్ములేపాలనుకుంటున్నాడు. ఈ క్రమంలో నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు బన్నీ. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా ప్రకటించాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో.. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ చిత్రాలొచ్చాయి. ఈ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టారు త్రివిక్రమ్-బన్నీ. అందుకే పుష్ప2 తర్వాత పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు రంగం సిద్దం చేస్తున్నారు. అయితే పుష్ప2 మీద భారీ అంచనాలున్నాయి.
ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత బన్నీ క్రేజ్ మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. దీంతో అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందనేది ఎటు తేలకుండా ఉంది. ఎందుకంటే.. ఇప్పటికే సందీప్ రెడ్డితో కూడా ఓ సినిమా అనౌన్స్ చేశాడు. అలాగే కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీతో కూడా ప్రాజెక్ట్ సెట్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. సందీప్ సినిమా లేట్ అవుతుంది కాబట్టి.. పుష్ప2 తర్వాత అట్లీ సినిమానే సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడట బన్నీ. దానికి కారణం కూడా లేకపోలేదు. గుంటూరు కారం సినిమాతో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాడు త్రివిక్రమ్. దీంతో.. అట్లీనే బెస్ట్ ఆప్షన్ అని అనుకుంటున్నాడట.
ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడట అట్లీ. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడని టాక్. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ.. ఇదే నిజమైతే.. త్రివిక్రమ్‌కు బన్నీ హ్యాండ్ ఇచ్చినట్టే.