టాలీవుడ్ లో చాలా ప్రెస్ మీట్లు జరుగుతుంటాయి… అలానే గీత ఆర్ట్స్ నుంచి బన్నీ వాస్ నిర్మిస్తున్న ‘ఆయ్’ అనే ఒక చిన్న సినిమా ప్రెస్ మీట్ ఈరోజు జరిగింది. అయితే ఈ ప్రెస్ మీట్ లో మీడియా కాన్సన్ట్రేషన్ మొత్తం బన్నీ సినిమాలు, మెగా ఫామిలీ గురించే సాగింది.
బన్నీ తరువాత సినిమా గురించి ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బన్నీ వాస్ సమాధానమిస్తూ… బన్నీ – త్రివిక్రమ్ కలిసి తరువాత చేయబోయే సినిమా ఎంత భారీగా ఉండబోతుందో రెవీల్ చేసారు. ఇప్పటికే ఒక కాన్సెప్ట్ లాక్ అయిందని, ఈ సినిమా కి ప్రీ ప్రోడుక్షనే దాదాపు ఏడాదిన్నర పడుతుందని, సినిమాకి అయ్యే ఖర్చు సమకూర్చడానికి చాలా సమయం పడుతుందని చెప్పుకొచ్చారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లోనే ఇదొక కాస్ట్లీ సినిమాగా ఉంటుందని బన్నీ వాస్ రివీల్ చేసారు.
బన్నీ – త్రివిక్రమ్ కలిస్తే ఎన్నో సెన్సషనల్ మూవీస్ వచ్చాయి .. సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ. త్రివిక్రమ్ కూడా ఇప్పటివరకూ చేయని జోనర్ తో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. త్రివిక్రమ్ క్యాపబిలిటీ గురించి బన్నీకి బాగా తెలుసనీ బన్నీ వాస్ చెప్పడంతో ఖచ్చితంగా ఈ సినిమా భారీగా ఉంటుందని అర్ధమవుతుంది.
మొత్తానికి అల్లు అర్జున్ పుష్పా 2 తరువాత సూపర్ సాలిడ్ బొమ్మతో రెడీ అవుతున్నారు. త్రివిక్రమ్ కి ఇదే మొదటి పాన్ ఇండియా సినిమా అవబోతుంది. అల్లు అరవింద్, హారిక హాసిని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు