E.G: వేగేశ్వరపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు విద్యార్థినులను కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆసుపత్రిలో కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం ఎమ్మెల్యే చికిత్సకు సంబంధించిన అన్ని ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్సే రామకృష్ణకి ఆదేశించారు.