»Cm Chandrababu Has A Crucial Meeting With Prime Minister Modi In Delhi
CM Chandrababu: ప్రధాని మోడీతో సీఏం చంద్రబాబు కీలక భేటీ
ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ మేరకు మోడీతో బాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన కీలక అంశాల మీద చర్చసాగనుంది. అనంతరం కేంద్రంలోని వివిధ మంత్రులను చంద్రబాబు కలువనున్నట్లు సమాచారం.
CM Chandrababu has a crucial meeting with Prime Minister Modi in Delhi
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు, నిధుల విషయంలో మాట్లాడానికి సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా రాష్ట్రానికి ఆర్థిక సాయం గురించి ప్రధానితో చర్చించారు. అలాగే మరికొన్ని అంశాలపై చర్చినట్లు తెలుస్తుంది. మోడీని కలువడానికి ముందే చంద్రబాబు కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కలిశారు. ఆయనతో దాదాపు అరగంట పాటు చర్చించారు. కూటమి విజయం గురించి, ఏపీ భవిష్యత్తు గురించి ముచ్చటించారు. చంద్రబాబుతో పాటు ఎన్డీయే ఎంపీలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మోడీతో సమావేశం అనంతరం మధ్యాహ్నం 12.15 గంటలకు నితిన్ గడ్కరీ, మధ్యాహ్నం 2 గంటలకు శివరాజ్‌సింగ్ చౌహాన్, మధ్యాహ్నం 2.45 గంలకు అమిత్ షా, సాయంత్రం 5.15 గంటలకు మనోహర్ లాల్ ఖట్టర్, సాయంత్రం 6 గంటలకు హర్దీప్ సింగ్ పురీతో సమావేశం కానున్నారు. అయితే ఎన్నికల హామిలో ఇచ్చిన స్పెషల్ స్టేటస్ అంశం మీద ఏపీ ప్రజలందరూ ఆశలు పెట్టుకున్నారు. దీనిపై చర్చించారా లేదా అనేది తెలియాల్సి ఉంది. అలాగే పోలవరం ప్రాజెక్ట్ గురించి ఎదైనా అప్డేట్ ఉంటుందని కూడా ప్రజలు భావిస్తున్నారు.