»Pawan Kalyan Bought Land In Pithapuram Land Price Details Are Here
pawan kalyan : పిఠాపురంలో ఇల్లు కట్టుకునేందుకు పవన్ సన్నాహాలు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందుకు ఆయన ఇప్పటికే స్థలాలను కొనుక్కున్నారు.
Date fixed for Deputy CM Pawan Kalyan's visit to Kondagattu
pawan kalyan : పోటీ చేసిన అన్ని నియోజవర్గాల్లోనూ జన సేన పార్టీ అభ్యర్థులు విజయకేతనం ఎగరేసి పవన్ సత్తా ఏంటో చూపించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్( PAWAN KALYAN) సొంత నియోజకవర్గం పిఠాపురం. ఇప్పుడు అక్కడ ఆయన ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు మొదలు పెట్టారు. ఇందుకు అనుగుణమైన సైట్ని ఆయన కొనుక్కున్నారు. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో ఉన్న రెండు సైట్లను ఆయన కొనుగోలు చేశారు.
ఇల్లింద్రాడ పరిధిలోని 1.44 ఎకరాల భూమి, మరోటి 2.08 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్థలం. ఇవి రెండూ కలిపితే దాదాపుగా మొత్తం మూడున్నర ఎకరాల భూమిని పనవ్(PAWAN) కొన్నారు. బుధవారమే ఈ బిట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ జరిగింది. రెండు ఎకరాల స్థలంలో క్యాంప్ ఆఫీసును కట్టుకుంటారని తెలుస్తోంది. మరో స్థలంలో ఇంటిని నిర్మించుకుంటారని సమాచారం. ఎన్నికలకు ముందే ఆయన పిఠాపురంలోనే ఉంటానని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
పిఠాపురంలో పవన్ స్థలం కొనుక్కున్న ప్రాంతంలో ప్రస్తుతం ఎకరం మార్కెట్ వలువ(LAND PRICE) 15 నుంచి 16 వరకు ఉంది. దీంతో మరికొన్ని ఎకరాలను కొనుక్కుని తోటలు సాగు చేసేందుకు జనసేన అధినేత సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. బుధవారం జరిగిన బహిరంగ సభలో సైతం పవన్ పిఠాపురం( PITHAPURAM) ప్రజల గురించి మాట్లాడారు. అక్కడ చేయబోయే అభివృద్ధి పనుల గురించి కూడా ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పిఠాపురం వాస్తవ్యుడిని అయినట్లుగా తెలిపారు.