JN: స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవాపూర్ వద్ద జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి ఓటు వేయడానికి వస్తున్న ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఐనవోలు మండలం నందనానికి చెందిన బుర్ర కళ్యాణ్ (27), ఐటీ ఉద్యోగి నవీన్ (27) బైక్పై వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకున్నది. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.