BHPL: గణపురం మండల కేంద్రంలోని శ్రీ గణపేశ్వరాలయంలో ఇవాళ కాళేశ్వరం ప్రభుత్వ వైద్యురాలు డా. సుస్మిత, మహాముత్తారం ప్రభుత్వ వైద్యులు డా. సందీప్ స్వామివారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నాగరాజు వారిచేత ప్రత్యేక పూజలు చేయించి.. తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, వైద్యులు తదితరులు ఉన్నారు.