కోల్కతాలో నిర్వహించిన మెస్సీ ఈవెంట్లో జరిగిన రచ్చపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనతో ప్రతి భారతీయుడు తల దించుకునేలా చేశారని ఎంపీ సుధాంశు త్రివేది మండిపడ్డారు. సీఎం మమతా బెనర్జీ పాలనలో పశ్చిమ బెంగాల్ సర్వనాశనమైందని విమర్శించారు. అంతర్జాతీయ స్టార్ వచ్చినప్పుడు ఇలాంటి గందరగోళం జరగడం దేశ పరువు తీసినట్లైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.