Bhole Baba: Bhole Baba by name.. but accused in five cases
Bhole Baba: భగవంతుడి ప్రతిరూపంగా ప్రచారం చేసుకున్న భోలే బాబా ప్రజలను పొట్టన పెట్టుకున్నారు. జగద్గురు సాకార్ విశ్వహరి భోలే బాబాగా ఫేమస్ అయిన ఇతని అసలు పేరు సూరజ్ పాల్. యూపీకి చెందిన సూరజ్ పాల్ మొదట తండ్రితో కలిసి వ్యవసాయం చేసేవాడు. ఆ తర్వాత పోలీసు శాఖలో ఉద్యోగంలో చేరి 18 ఏళ్ల పాటు పనిచేశాడు. కానీ ఇంటలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తున్నట్లు చెప్పుకునేవాడు. 1999లో ఉద్యోగం వదిలి బాబా అవతారం ఎత్తాడు. అయితే లైంగిక వైధింపుల కేసులో ఇరుక్కోవడం వల్ల బాబా సస్పెండ్ అయ్యాడనే ప్రచారం కూడా ఉంది. అతనిపై ఐదు లైంగిక దాడి కేసులు కూడా నమోదయ్యాయి.
1997లో ఓ కేసులో అరెస్టయి కొన్నాళ్లు జైలు శిక్ష కూడా అనుభవించారట. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాతే ఓ ఆశ్రమం ప్రారంభించి.. తనకు గురువు ఎవరూ లేరని చెప్పుకునేవారట. కాషాయానికి బదులుగా తెల్లటి దుస్తులు ధరించేవారట. తనను నమ్మేవారిని మూఢ నమ్మకాలతో ముంచేస్తాడు. తాను నిర్వహించే సత్సంగ్‌లలో ఇచ్చే పవిత్ర జలం తాగితే భక్తుల సమస్యలు తీరిపోతాయనే ప్రచారం చేయించాడు. తన పాదధూలి కూడా పవిత్రమైనదని, బాబా నడిచిన నేలపై మట్టిని తాకినా అదృష్టం వరిస్తుందనే నమ్మకాన్ని సృష్టించాడు. వీటిని నమ్మే ఉత్తరప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్, హరియాణా, రాజస్థాన్‌తో పాటు ఢిల్లీ నుంచి పెద్ద ఎత్తున జనం భోలే బాబా దర్శనం కోసం వచ్చే వారు.