Supreme Court: The Supreme Court refused to hear the Hathras stampede incident
Supreme Court: ఇటీవల జరిగిన హాథ్రస్ తొక్కిసలాట ఘటనపై విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఈ పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇలాంటి కేసులు దేశ ప్రజలను కలవరపెడుతున్నాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జె.బి.పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఇలాంటి కేసులు పరిష్కరించేందుకు హైకోర్టులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఈ ఘటనపై అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.
జులై 2న జరిగిన హాథ్రస్ తొక్కిసలాట ఘటనపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని నియమించాలని పిటిషనర్ విశాల్ తివారీ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు క్షతగాత్రులకు వెంటనే వైద్యం అందించడానికి వైద్యశాలలు అందుబాటులో లేవు. దేశంలో ఇదో పెద్ద సమస్య అని పిటిషనర్ తెలిపారు. సమస్యపై సుప్రీం దృష్టిపెట్టాలని కోరగా.. దీనిని తిరస్కరించారు.