»Fake Products Fake Products Are Increasing Day By Day Tons Of Ginger Paste Seized
Fake Products: రోజురోజుకి పెరుగుతున్న నకిలీ ఉత్పత్తులు.. టన్నుల అల్లం పేస్ట్ స్వాధీనం
ప్రస్తుతం రోజురోజుకి నకిలీ ఉత్పత్తులు పెరిగిపోతున్నాయి. తాజాగా సైబరాబాద్ పోలీసులు నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీపై దాడులు నిర్వహించారు. దాదాపు 15 లక్షల విలువ గల 7.3 టన్నుల పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు.
Fake Products: Fake products are increasing day by day. Tons of ginger paste seized
Fake Products: ప్రస్తుతం రోజురోజుకి నకిలీ ఉత్పత్తులు పెరిగిపోతున్నాయి. తాజాగా సైబరాబాద్ పోలీసులు నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీపై దాడులు నిర్వహించారు. దాదాపు 15 లక్షల విలువ గల 7.3 టన్నుల పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్ బుద్వేల్లోని గ్రీన్ సిటీలో అప్న ఎంటర్పైసెస్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఫ్యాక్టరీని నిర్వహిస్తున్న అమీర్ నిజాన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదకర సింథటిక్ కలర్స్, యాసిడ్స్, కెమికల్ వాటర్ వాడుతున్నట్లు నిర్ధారణ రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు పరీక్షలు చేపట్టారు. నకిలీ ఉత్పత్తులపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ తయారీదారులు మాత్రం ఈ పని వదలిపెట్టడంలేదు. అధికారులకు దొరక్కుండా చాలా రహస్యంగా నకిలీ ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంట్లోనే చేసుకోవడం బెటర్.