»You Are My Strength Assembly Gate Is Untouchable But Pawan Kalyan
Pawan Kalyan: నా బలం మీరే.. అసెంబ్లీ గేటు తాకనీయమన్నారు కానీ… పవన్ కల్యాణ్
కాకినాడ పర్యాటనలో భాగంగా జనసేన పవన్‌కల్యాణ్ బుధవారం సాయంత్ర పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఆయన్ను అఖండ విజయంతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలందరి సమక్షంలో మరోసారి ప్రమాణస్వీకారం చేశారు.
You are my strength.. Assembly gate is untouchable but... Pawan Kalyan
Pawan Kalyan: ఆకలి అన్న వారి కడుపు నింపిన డొక్కాా సీతమ్మ స్పూర్తితో కూటమిని ముందుకు తీసుకెళ్లానని, ఎలాంటి పదవులు ఆశించలేదని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. ఎమ్మెల్యే అవుతానో లేదో అనేది కూడా ఆలోచించలేదు కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎంను చేశారు. ఈ విజయం అంతా పిఠాపురం ప్రజలదే అని తన విజయాన్ని ప్రజలకే అంకితం చేస్తున్నా అని పేర్కొన్నారు. మబ్బుల్లో పరుగెత్తే పిడుగుళ్లాంటి జనసైనుల బలం ఎంటో ఏపీ చూసిందని అన్నారు. అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వను అని చాలా మంది అన్నారు. నేనే దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు కానీ పిఠాపురం ప్రజలు సిరీయస్‌గా తీసుకున్నారని ఫలితాలు చూస్తే అర్థం అయింది. టీడీపీ సీనియర్ నేత వర్మ చెప్పినట్లు గేట్లు బద్దలు కొట్టుకొని వెళ్లేలా జనసేన ఫలితాలు వచ్చాయి అని పేర్కొన్నారు.
ఇక మంత్రిపదవి విషయంలో చాలా మంది హోం శాఖ, రెవిన్యూ శాఖ తీసుకోవాలని అన్నారు. కానీ బాపుజీ కలలుకన్న గ్రామస్వారాజ్యాన్ని నెలకొల్పాలని గ్రామీన అభివృద్ధి శాఖను తీసుకున్నట్లు చెప్పారు. తాను పిఠాపురం వ్యాస్తవ్యుడు అయినట్లు, దానికోసం భూమి కూడా తీసుకున్నట్లు బహిరంగ సమావేశాల్లో చెప్పారు. నాకు గెప్పెడు బలం ఇస్తే కూటమికి బలంగా నిలబడినట్లు చెప్పారు. ఈ సందర్భంగా 9 నెలల నుంచి కనిపించని ఓ ఆడబిడ్డ గురించి ఓ మహిళ చెప్పిన సంఘటనను పంచుకున్నారు. ఆ తల్లి ఏడుపు నా గుండెను కదిలించింది. వెంటనే అధికారులతో మాట్లాడాడు. 9 నెలలుగా దొరకని బిడ్డ 9 రోజుల్లో దొరకడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పవన్ కల్యాణ్ చెప్పారు. ఈ విషయంలో ఏపీ పోలీసు శాఖను కొనియాడు. తరువాత పిఠాపురంలో నియోజకవర్గంలో ఆయన చేయబోయే పనుల గురించి చెప్పారు. శెరి కల్చర్, రోడ్లు, ఉప్పాడ తీరప్రాంతాన్ని టూరిజం చేస్తానని అన్నారు.