AP: తిరుమలలో వైకుంఠద్వార దర్శన ఏర్పాట్లకు 2 నెలలుగా పనిచేస్తున్నామని TTD ఛైర్మన్ BR నాయుడు తెలిపారు. గత అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం సబ్‌కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్‌పై కూడా ఆయన స్పందించారు. టోకెన్లు లేకుంటే తిరుమలకు రానివ్వరంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి ప్రచారాలను నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు.