NLR: కందుకూరు మండలం మాల్యాద్రి కాలనీ సమీపంలోని హైవేపై మంగళవారం ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి బైకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు గాయపడిన వ్యక్తిని కందుకూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన బైకు తమిళనాడు రిజిస్ట్రేషన్‌కు చెందినదిగా గుర్తించారు.