AP: ఆర్టీసీపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈవీ బస్సు ‘పల్లె వెలుగు’ అయినా ఏసీ ఉంటుందని తెలిపారు. వచ్చే ఏడాది కొత్తగా మరో 1,450 ఈవీ బస్సులు వస్తాయని చెప్పారు. కేంద్రం నుంచి మరో 1,050 ఈవీ బస్సులు రానున్నాయని పేర్కొన్నారు. పుష్కారాల దృష్ట్యా గోదావరి జిల్లాల్లో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.