SKLM: గత ప్రభుత్వంలో అర్థంతరంగా నిలిచిపోయిన నరసన్నపేట ఇండోర్ స్టేడియం పనులను ఇవాళ సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే రమణమూర్తి పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. క్రీడల ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని తెలిపారు.