KNR: శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. సోమవారం సాయంత్రం రైతులు తమ వ్యవసాయ పనులను ముగించుకొని, ట్రాక్టర్లను పొలాల వద్దే నిలిపి వెళ్లారు. మంగళవారం ఉదయం వచ్చి చూడగా, గుర్తుతెలియని దుండగులు ట్యాంకర్ల తాళాలు పగులగొట్టి డీజిల్‌ను అపహరించినట్లు గుర్తించారు.