గుంటూరు: ఎరువులు, పురుగు మందులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని పొన్నూరు ADA వి.రామకోటేశ్వరి హెచ్చరించారు. మంగళవారం స్థానిక ADA కార్యాలయంలో మండల పరిధిలోని ఎరువులు, పురుగు మందుల డీలర్లతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయాలు జరపాలని ఆదేశించారు.