MDK: తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ మంగళవారం భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, సత్యప్రసాద్, అనితతో మంత్రి దామోదర్ కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. వైభవోపేతంగా జరిగిన దర్శనం అనంతరం స్వామివారి ఆశీస్సులు అందుకున్నట్లు తెలిపారు.