కర్నూలు: చిప్పగిరి మండలంలోని డేగలహల్ గ్రామంలో భారీగా సాగు చేస్తున్న గంజాయి తోటను గుర్తించిన పోలీసులను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు. కేసులో చురుగ్గా వ్యవహరించిన ఎస్సై సతీశ్ కుమార్తో పాటు సిబ్బంది ఖాదర్ బాషా, షబ్బీర్, శంకర్లకు ప్రశంసా పత్రాలు మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ హుస్సేన్ పీరా, పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య ఉన్నారు.