విశాఖ వేదికగా శ్రీలంక మహిళా జట్టుతో జరుగుతున్న రెండో టీ20లో భారత బౌలర్లు సత్తా చాటారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన శ్రీలంక.. భారత బౌలర్ల ధాటికీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 128 పరుగులకే పరిమితమైంది. లంక బ్యాటర్లలో చామరి(31), హర్షిత(33) రాణించగా, మిగిలిన వారు స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. బౌలర్లలో శ్రీ చరణి, వైష్ణవి తలో రెండు వికెట్లు తీసుకున్నారు.