PPM: లారీ నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన పార్వతీపురం మండలం హిందూపురం కూడలి వద్ద చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై సంతోషి తెలిపిన వివరాలు ప్రకారం.. హిందూపురం వైపు వెళుతున్న లారీ నుంచి శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస గ్రామానికి చెందిన తారకేశ్వరరావు (35) జారి పడ్డాడు. ఈ ప్రమదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.