JGL: ‘మీ డబ్బు-మీ హక్కు’ కార్యక్రమాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ లత పేర్కొన్నారు. గడచిన కొన్ని సంవత్సరాలుగా క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల కోసం ‘మీ డబ్బు-మీ హక్కు’ ప్రత్యేక కార్యక్రమాన్ని ఆర్బీఐ ఆదేశాల మేరకు జగిత్యాల కలెక్టరేట్లో సోమవారం నిర్వహించారు. క్లైమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల సమస్యను పరిష్కరించుకోవచ్చన్నారు.