KDP: వల్లూరు మండల ఎమ్మార్వో కార్యాలయం వద్ద మంగళవారం రోడ్డు దాటుతున్న వృద్ధున్ని గుర్తు తెలియని టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కొప్పులు గ్రామానికి చెందిన ఓబన్న (60) తీవ్రంగా గాయపడడంతో స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ సమాచారం అందించారు. వెంటనే వారు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.