KMM: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF) జిల్లా సహాయ కార్యదర్శిగా ఖమ్మం రూరల్ మండలానికి చెందిన రిపోర్టర్ జక్కంపూడి కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన TWJF నాల్గవ జిల్లా మహాసభలో కృష్ణను ఎన్నుకున్నారు. కాగా, కృష్ణ గతంలో టీడబ్ల్యుజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.