నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ప్యారడైజ్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఓ ఐటెం సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నారట. ఈ స్పెషల్ సాంగ్ కోసం తమన్నా భాటియాను రంగంలోకి దింపబోతున్నట్లు సినీ వర్గాల్లో గట్టిగా టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.