VSP: బీపీసీఎల్ ప్లాంట్‌కి కేటాయించిన భూములను రద్దు చేయాలని కార్పొరేటర్ వెంకటసాయి అనూష డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌ను మంగళవారం కలిసి ఆమె వినతి పత్రం అందించారు. “ఉక్కు వాడ”గా పేరుగాంచిన గాజువాక ప్రాంతంలో కాలుష్య కారక పరిశ్రమ అయిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) బాట్లింగ్ ప్లాంట్‌కి కేటాయించిన భూములను రద్దు చేయాలన్నారు.