HYD: నగరంలో నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మద్యం విక్రయాలపై ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 31న మద్యం దుకాణాలు (A4 షాపులు) రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతించారు. అలాగే బార్లు, క్లబ్లు, టూరిజం హోటళ్లు, ప్రత్యేక ఈవెంట్లకు రాత్రి 1గంట వరకు మద్యం సరఫరా చేసేందుకు అవకాశం ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ కమిషనర్ సీ.హరికిరణ్ తెలిపారు.