TG: మహబూబ్‌నగర్ DTC కిషన్‌ను అరెస్ట్ చేసినట్లు ACB అధికారులు తెలిపారు. కిషన్‌కు చెందిన రూ.12 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. పాట్ మార్కెట్లోని గోల్డ్ షాపు నుంచి బంగారం తెచ్చి జప్తు చేశామని అన్నారు. నారాయణఖేడ్‌లోని 30 ఎకరాల భూమితో పాటు నిజామాబాద్‌లో 10 ఎకరాల్లో ఉన్న హోటల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.