కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తరఫున ప్రధాని అభ్యర్థిగా ప్రియాంకా గాంధీని ఎన్నుకోవాలని ఆ పార్టీ MP ఇమ్రాన్ మసూద్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. పార్టీ కార్యకర్తలంతా ప్రియాంక ప్రధాని కావాలని కోరుకుంటున్నారని అన్నారు. రాజకీయాల్లో ప్రియాంక ముందడుగు వేయాలని, తాను కూడా రాజకీయాల్లోకి రావాలని అందరూ కోరుకుంటున్నారని తెలిపారు.