NZB: బీబీపేట మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సర్పంచ్ ఏదుల సాత్విక భూమి పూజ చేశారు. ఈ ఇళ్లను త్వరగా పూర్తిచేసుకుని, ప్రభుత్వం నుంచి వచ్చే సదుపాయాలను పొంది, నిరుపేదలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చందుపట్ల ప్రశాంత్, పంచాయతీ సెక్రటరీ రమేష్, కాంగ్రెస్ నాయకులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.