NTR: జగ్గయ్యపేటలోని ఉపాధ్యాయుల జీతాల బిల్లులు కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, డీ.ఈ.వో, ఎన్.టీ.ఆర్ వారి ఉత్తర్వుల మేరకు ఎమ్.ఆర్.సీలోని డేటా ఎంట్రీ ఆపరేటర్‌తో మాత్రమే చేయించాలని ఎస్టీయు నాయకులు అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఉపాధ్యాయులతో లేదా ఏ సంఘ సభ్యులతో కానీ బిల్లులు చేయించకూడదన్నారు. ఈ మేరకు STU నాయకులు MEO చిట్టిబాబుకు ఈరోజు వినతిపత్రం అందజేశారు.