KDP: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని జీ రామ్ జీ పేరుతో మార్చడాన్ని నిరసిస్తూ రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ పోరుయాత్ర చేపట్టనుందని రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి తెలిపారు. మంగళవారం కడపలో ఆయన మాట్లాడుతూ.. ఉపాధి కూలీలకు 200 రోజులు పని, రూ.600 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గాంధీ పేరును తొలగించి చట్టాన్ని నిర్వీర్యం చేయడం తగదన్నారు.