MBNR: నవజాత శిశువుల ఆరోగ్యానికి తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన ‘యెన్నం హెల్త్ కిట్స్’ పంపిణీ చేశారు. మాతా శిశువుల సంరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.