ATP: పామిడి ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఎంపీడీవో తేజోష్ణ ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ మురళి మోహన్ రెడ్డి అధ్యక్షత వహించారు. పలువురు గ్రామ సర్పంచ్ లు గ్రామాలలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలన్నారు. గ్రామాలలో నూతన డ్రైనేజీ, సీసీ రోడ్లు నిర్మాణాలను చేపట్టాలన్నారు.