MBNR: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ మొహం పెట్టుకుని పాలమూరుకు వస్తున్నారని టీడీపీ కేంద్ర పోలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముందుగా కేసీఆర్ తన కూతురు అందించిన ప్రశ్నలకు జవాబు చెప్పి ప్రజాక్షేత్రంలోకి రావాలని సూచించారు.