AP: పల్నాడు ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధ్యక్షతన జిల్లా సాగునీటి సలహామండలి భేటీ అయింది. ఈ సమావేశంలో జిల్లా నేతలు, అధికారులు పాల్గొన్నారు. సాగర్ జలాలు, సాగునీటి వినియోగంపై ప్రధానంగా చర్చ జరిగింది. సాగునీటి కాల్వల నిర్వహణ మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. కాల్వల్లో సీపేజీ ద్వారా నీరు నష్టపోకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.