AP: ధాన్యం కొనుగోళ్లు, వివిధ పంట ఉత్పత్తుల మార్కెటింగ్‌పై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వివిధ జిల్లాల్లో నిర్దేశిత గడువులోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్లతో మాట్లాడి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే తరహా బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చేలా చూడాలన్నారు.