E.G: రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల రౌడీ షీటర్లు, పాత నేరస్తులకు జిల్లా ఎస్పీ డీ.నరసింహా కిషోర్ మంగళవారం ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. జిల్లాలో నేర నియంత్రణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ విస్తృత ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో, కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు.