E.G: కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెస్ట్ గనుగుదెంలో అక్రమంగా నాటు సారా విక్రయిస్తున్న మహిళను కొరుకొండ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఎస్హెచ్వో ఎస్. శ్రీనివాస్ ఆదేశాల ప్రకారం ప్రత్యేక దాడి నిర్వహించి నిందితురాలిని సంఘటన స్థలంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో నిందితురాలి వద్ద నుంచి 9 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు.