సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘వారణాసి’. ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ‘X’ వేదికగా వెల్లడించాడు. ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన ఒక షెడ్యూల్ కూడా పూర్తయిందని పేర్కొన్నాడు. కాగా, ఈ చిత్రంలో మహేష్ బాబుకు తండ్రి పాత్రలో ఆయన నటించనున్నట్లు తెలుస్తోంది.