SKLM: సంతబొమ్మాళి మండలం వల్లెవలస ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 100 రోజులు ప్రణాళికలో భాగంగా 10 వ తరగతి విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇళ్లకు వెళ్లి వచ్చేందుకు తగిన సమయం లేకపోవడంతో ఉదయం, సాయంత్రం విద్యార్థులకు టిఫిన్ అందించే కార్యక్రమం స్థానిక మనబడి ప్రతినిధులు మంగళవారం అందించారు.