KMR: టీఎన్జీవో బలోపేతానికి ఉద్యోగులందరూ సభ్యత్వం తీసుకోవాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారుల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా ఉండాలని కోరారు.