NZB: బోధన్ పట్టణంలోని రాకా సిపేట్లో గల ఎక్సైజ్ కార్యాలయంలో బుధవారం వాహనాల వేలం పాట నిర్వహిస్తున్నట్లు బోధన్ ఎక్సైజ్ శాఖ సీఐ భాస్కర్ రావు తెలిపారు. వివిధ కేసులలో సీజ్ చేసిన వాహనాలను వేలం వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు వేలంపాట ప్రారంభమవుతుందని, ఆసక్తి గలవారు హాజరుకావాలని సూచించారు.