TG: సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. డ్రైనేజీ శుభ్రం చేసేందుకు వెళ్లి ఇద్దరు కార్మికులు మృతిచెందారు. కొల్లూరులోని అపార్ట్మెంట్ వద్ద డ్రైనేజీ శుభ్రం చేసేందుకు కార్మికులు వెళ్లారు. మృతులు హరీష్ సింగ్ (25), సోమిత్ (22)గా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన కొల్లూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.