KDP: రాబోయే రోజుల్లో అన్ని వర్గాలను అభివృద్ధి పరచడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలో ముందుకెళ్తామని పులివెందుల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోనాల ఖాదర్ పేర్కొన్నారు. మంగళవారం పులివెందులలో వారు మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పులివెందులలో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు.