WG: పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామంలో నిన్న అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పందించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసు, రవాణా శాఖలతో పాటు ఆర్ అండ్ బి శాఖ అధికారులతో త్రిసభ్య కమిటీ వేసి విచారణ చేయాలని ఆమె ఆదేశించారు.