JGL: మొబైల్ ఎక్స్ రే మిషన్ ద్వారా క్షయ వ్యాధి గుర్తింపు సులభమవుతుందని జిల్లా వైద్యాధికారి ఆకుల శ్రీనివాస్ తెలిపారు. టీబీ ముక్త భారత్ అభియాన్లో భాగంగా జగిత్యాల ఖిలాగడ్డ అర్బన్ ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక టీబీ క్యాంపు నిర్వహించారు. మొబైల్ ఎక్స్రే ద్వారా అక్కడికక్కడే పరీక్షలు చేసి బాధితులను గుర్తించి మందులు అందజేశారు.