W.G: నరసాపురం మండలం రుస్తుంబాద లేసు ట్రేడింగ్ సెంటర్ను ఇవాళ రాజ్యసభ్య సభ్యుడు పాక సత్యనారాయణ సందర్శించారు. సత్యనారాయణ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా తయారుచేసిన చేనేత, హస్తకళల ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చేనేత, హస్త కళ ఉత్పత్తులతో ఇంత పెద్ద ఎత్తున నరసాపురాన్ని ఎంచుకొని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.