ప్రకాశం: దొనకొండ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ నంద్యాల శ్రీనివాసులు కుటుంబానికి మంగళవారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు చెక్కును పంపిణీ చేశారు. హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు కుటుంబానికి బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా పోలీస్ శాలరీ ప్యాకేజీ కింద రూ.15 లక్షలు మంజూరు కాగా ఆ చెక్కును అందజేశారు. మీ కుటుంబానికి పోలీసు వ్యవస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.